వారెవ్వా విరాట్‌.. డైవ్‌ చేస్తూ సూపర్‌ క్యాచ్‌! వీడియో వైరల్ | Virat Kohli Starts Cricket World Cup 2023 With Stunning Catch | Sakshi
Sakshi News home page

World Cup 2023: వారెవ్వా విరాట్‌.. డైవ్‌ చేస్తూ సూపర్‌ క్యాచ్‌! వీడియో వైరల్

Oct 8 2023 2:35 PM | Updated on Oct 8 2023 3:33 PM

Virat Kohli Starts Cricket World Cup 2023 With Stunning Catch  - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ విరాట్‌ ​కోహ్లి అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 3 ఓవర్‌ వేసిన జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఔట్‌ సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని స్లిప్స్‌ దిశగా వెళ్లింది.

ఈ క్రమంలో సెకెండ్‌ స్లిప్‌లో కోహ్లి డైవ్‌ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా మార్ష్‌ బిత్తరపోయాడు. కాగా కోహ్లి దెబ్బకు మార్ష్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. కోహ్లి క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: ODI WC 2023: 'కోహ్లి, రోహిత్‌ కాదు.. వరల్డ్‌కప్‌ టాప్‌ రన్‌ స్కోరర్‌ అతడే'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement