
PC: IPL.com
ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ పరాజయం పాలైంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆఖరి బంతికి గెలుపొందింది.
ఇక తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ డేవిడ్ వార్నర్(51), అక్షర్ పటేల్(25 బంతుల్లో 54 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో బెహ్రెన్‌డార్ఫ్, చావ్లా మూడు వికెట్లు సాధించగా.. మెరిడిత్ రెండు వికెట్లు పడగొట్టాడు.
డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో 600 ఫోర్లు బాదిన తొలి విదేశీ క్రికెటర్‌గా వార్నర్ నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో 6 ఫోర్లు కొట్టిన డేవిడ్ భాయ్.. ఈ అరుదైన రికార్డును సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్(728) ఫోర్లతో తొలి స్థానంలో ఉన్నాడు.
చదవండి: #Tilak Varma: ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న హైదరాబాదీ.. టీమిండియా ఎంట్రీ ఖాయం!
Comments
Please login to add a commentAdd a comment