జింబాబ్వే పతనం శాసించిన విండీస్‌ బౌలర్‌.. సిరీస్‌ సొంతం | West Indies Beat Zimbabwe By Innings 4 Runs Clinch Test Series 1-0 | Sakshi
Sakshi News home page

WI Vs ZIM: జింబాబ్వే పతనం శాసించిన విండీస్‌ బౌలర్‌.. సిరీస్‌ సొంతం

Published Tue, Feb 14 2023 9:04 PM | Last Updated on Tue, Feb 14 2023 9:04 PM

West Indies Beat Zimbabwe By Innings 4 Runs Clinch Test Series 1-0 - Sakshi

జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్‌ 1-0తో కైవసం చేసుకుంది. బులవాయో వేదికగా జరిగిన రెండో టెస్టులో విండీస్‌ ఇన్నింగ్స్‌ 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 177 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన జింబాబ్వే 173 పరుగులకే కుప్పకూలింది. గుదకేష్‌ మోతీ ఆరు వికెట్లతో చెలరేగి జింబాబ్వే పతనాన్ని శాసించాడు.  క్రెయిగ్‌ ఇర్విన్‌ 72 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.

అంతకముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత వెస్టిండీస్‌ 292 పరుగులకు ఆలౌటైంది. దీంతో విండీస్‌కు 177 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఇక తొలి టెస్టు డ్రాగా ముగియడంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను విండీస్‌ 1-0తో సొంతం చేసుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను కూడా గుదకేశ్‌ మోతీ సొంతం చేసుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement