స్పెయిన్‌కు చుక్కలు చూపించిన గోల్‌కీపర్‌.. ఎవరీ వోజిన్హా? | Who is Vozinha? 40 Years Cape Verde Goal Keeper Playing Debut FIFA WC | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌కు చుక్కలు చూపించిన గోల్‌కీపర్‌.. ఎవరీ వోజిన్హా?

Jun 16 2026 9:03 AM | Updated on Jun 16 2026 10:54 AM

Who is Vozinha? 40 Years Cape Verde Goal Keeper Playing Debut FIFA WC

స్టార్‌డ‌మ్ అనేది ఉన్న‌ప‌ళంగా రాదు. దానికోసం ఎంతో క‌ష్ట‌ప‌డాలి. అందులోనూ అనామ‌క జ‌ట్టు నుంచి వ‌చ్చే ఆట‌గాళ్లకు పెద్ద‌గా గుర్తింపు ఉండ‌దు. ఏదైనా సంచ‌ల‌నాలు న‌మోదైన‌ప్పుడే అవి వెలుగులోకి వ‌స్తాయి. తాజాగా ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో మాజీ చాంపియ‌న్ స్పెయిన్‌తో జ‌రిగిన లీగ్ మ్యాచ్‌ను కేప్ వెర్డె డ్రా చేసుకున్న‌ప్ప‌టికీ సంబరాల్లో మునిగిపోయింది. 

కానీ ఒక్క‌డు మాత్రం మ్యాచ్ ముగిసినా అదే ప‌నిగా ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తున్న వ్య‌క్తి ఎవ‌రా అని ఆరా తీస్తే కేప్‌వెర్డె గోల్ కీప‌ర్, 40 ఏళ్ల వోజిన్హా. వోజిన్హా లేక‌పోయుంటే మాత్రం ఇవాళ కేప్‌వెర్డె అనామ‌క జ‌ట్టుగానే ఉండిపోయేది. 40 ఏళ్ల వయసు అంటే రిటైరయ్యే టైమ్‌.. కానీ వోజిన్హా మాత్రం 40 ఏళ్ల వయసులో తొలి ఫిఫా వరల్డ్‌కప్‌ ఆడుతున్నాడు. స్పెయిన్‌తో మ్యాచ్‌కు ముందు వోజిన్హా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్ల సంఖ్య 50వేలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 5 మిలియ‌న్ల‌కు చేర‌డం విశేషం. ఈ నేపథ్యంలో వొజిన్హా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో అనామ‌క జ‌ట్టైన కేప్ వెర్డె మాజీ చాంపియ‌న్‌, ప్ర‌పంచ మూడో ర్యాంక‌ర్‌ స్పెయిన్‌ను నిలువ‌రించి పెద్ద సంచ‌ల‌నం న‌మోదు చేసింది. మ్యాచ్ డ్రా అయిన‌ప్ప‌టికీ కేప్ వెర్డె ఖాతాలో ఇది విజ‌యం కిందే లెక్క‌. మ్యాచ్ డ్రా అయిన‌ప్ప‌టికీ నిజ‌మైన హీరో మాత్రం 40 ఏళ్ల గోల్ కీప‌ర్ వోజిన్హానే అని చెప్పొచ్చు.  లామినే య‌మాల్, రోడ్రి,పెడ్రీ వంటి స్టార్ ఆట‌గాళ్లున్న స్పెయిన్ వంటి బ‌ల‌మైన జ‌ట్టును త‌న గోల్ కీపింగ్ నైపుణ్యంతో నిలువ‌రించి అడ్డుగోడ‌లా నిల‌బ‌డ్డాడు వోజిన్హా. 

ఏకంగా ఏడుసార్లు స్పెయిన్‌ ప్లేయర్లు గోల్‌ పోస్ట్‌ లక్ష్యంగా కొట్టిన షాట్‌లను అతను సమర్థవంతంగా  అడ్డుకున్నాడు. స్పెయిన్ సంచ‌ల‌నం లామినె యామల్‌ 71వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌ ఆటగాళ్లు బంతిని 62 శాతం తమ ఆదీనంలో ఉంచుకున్నా కేప్‌ వెర్డె గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించడంలో మాత్రం స‌క్సెస్ కాలేక‌పోయారు. ఫిఫా చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన వోజిన్హాకే మ్యాచ్‌లో ఫిఫా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

మ్యాచ్ ముగిసిన అనంతరం కేప్ వెర్డె గోల్‌కీప‌ర్ 40 ఏళ్ల వోజిన్హా ఎమోష‌న‌ల్ అయ్యాడు. 'ఇవాళ నా ప్ర‌ద‌ర్శ‌న‌తో సంతృప్తిగా ఉన్నా. స్టార్ ఆట‌గాళ్ల‌తో నిండి ఉన్న స్పెయిన్‌ను అడ్డుకోవ‌డం క‌ష్ట‌మైన‌ప్ప‌టికీ నా శాయాశ‌క్తులా కృషి చేశాను. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఇవాళ నా ప్ర‌ద‌ర్శ‌న చూడ‌డానికి మా అమ్మ నా ద‌గ్గ‌ర లేదు. వీసా స‌మ‌స్య‌ల వ‌ల్ల ఆమె రాలేక‌పోయింది. 

ఇక గేమ్ ముగిసిన త‌ర్వాత అంత‌లా ఏడ్వ‌డానికి ఒక కార‌ణ‌ముంది. నేను చిన్న‌ప్ప‌టి నుంచి ఎక్కువ‌గా మా గ్రాండ్‌పేరేంట్స్‌తోనే పెరిగాను. ఇవాళ నా ప్ర‌ద‌ర్శ‌న చూడ‌డానికి వారిద్ద‌రూ సజీవంగా లేరు. ఏడాది క్రిత‌మే న‌న్ను ఒంట‌రిని చేసి వెళ్లిపోయారు. క‌నీసం ఈ స‌మ‌యంలో నా ప‌క్క‌న మా అమ్మ ఉండుంటే బాగుండేది' అని చెప్పుకొచ్చాడు.

ఎవ‌రీ వోజిన్హా?
25 ఏళ్ల వ‌య‌సులో ప్రొఫెష‌న‌ల్ ఫుట్‌బాల్ ఆట‌ను ఆడ‌డం ప్రారంభించిన వోజిన్హా మాల్డోవా, సిప్ర‌స్‌, స్లోవెకియా, పోర్చుగ‌ల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్ల‌బ్స్ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించాడు. 2012లో కేప్ వెర్డె జాతీయ జ‌ట్టుకు ఎంపికైన వోజిన్హా ఫిఫా ప్ర‌పంచ‌కప్ ఆడేందుకు 15 ఏళ్లు ప‌ట్టింది. ఈ 15 ఏళ్ల‌లో అత‌డు ఐదు మేజ‌ర్ టోర్నీలు ఆడాడు. ఆఫ్రికా క‌ప్ నేష‌న్స్ టోర్నీలో పాల్గొన్నాడు.

 

చదవండి: లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై నిషేధం తప్పదా!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement