డబుల్‌ సెంచరీతో విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యశస్వీ జైశ్వాల్‌ | Yashasvi Jaiswal becomes 3rd youngest Indian to hit double century in Test cricket | Sakshi
Sakshi News home page

IND vs ENG: డబుల్‌ సెంచరీతో విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యశస్వీ జైశ్వాల్‌

Published Sat, Feb 3 2024 11:24 AM | Last Updated on Sat, Feb 3 2024 11:41 AM

yashasvi Jaiswal becomes 3rd youngest Indian to hit double century in Test cricket - Sakshi

వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ దుమ్ము రేపాడు. తన కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీని జైశ్వాల్‌ సాధించాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో యశస్వీ తన డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 290 బంతుల్లో 209 పరుగులు చేసి జైశ్వాల్‌ ఔటయ్యాడు.

ఇక ఈ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన యశస్వీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరపున డ‌బుల్ సెంచ‌రీ బాదిన మూడో అతి పిన్న వయస్కుడిగా జైశ్వాల్‌ రికార్డులకెక్కాడు. జైశ్వాల్‌ 22 ఏళ్ల 37 రోజుల వయస్సులో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ(21 ఏళ్ల 35 రోజులు) తొలి స్ధానంలో ఉన్నాడు.

ఆ తర్వాతి స్ధానంలో భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌(21 ఏళ్ల 283 రోజులు) నిలిచాడు. అదే విధంగా అతి త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో టెస్టుల్లో మొద‌టి డ‌బుల్ సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్ల జాబితాలోనూ య‌శ‌స్వి జైస్వాల్ చోటు సంపాదించాడు. ఈ జాబితాలో అత‌డు ఆరో స్థానంలో నిలిచాడు. క‌రుణ్ నాయ‌ర్ ఈ జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో తొలి డ‌బుల్ సెంచ‌రీ చేసిన భార‌త ఆట‌గాళ్లు
కరుణ్ నాయర్ – 3 ఇన్నింగ్స్‌ల్లో
వినోద్‌ కాంబ్లీ – 4
సునీల్ గ‌వాస్క‌ర్ – 8
మ‌యాంక్ అగ‌ర్వాల్ -8
ఛ‌తేశ్వ‌ర్ పుజారా – 9
య‌శ‌స్వి జైస్వాల్ – 10

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement