
సౌతాంప్టన్: పాకిస్తాన్‌తో శుక్రవారం ప్రారంభమైన మూడో టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. జాక్ క్రాలీ (269 బంతుల్లో 171 బ్యాటింగ్; 19 ఫోర్లు) కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీతో అదరగొట్టగా... అతనికి వికెట్ కీపర్ జాస్ బట్లర్ (148 బంతుల్లో 87; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తన దూకుడైన బ్యాటింగ్‌తో సహకరించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా ఇప్పటికే 205 పరుగులు జోడించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలో పాక్ బౌలర్లు దెబ్బ తీశారు. బర్న్స్ (6), సిబ్లీ (22), రూట్ (29), పోప్ (3) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. 127 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ దశలో పట్టు బిగించేందుకు వచ్చిన అవకాశాన్ని పాకిస్తాన్ చేజార్చుకుంది.
టెస్టుల్లో 500 వికెట్లు మైలురాయిని దాటిన ఏడో బౌలర్‌గా నిలిచిన స్టువర్ట్ బ్రాడ్‌ను ఈసీబీ సన్మానించింది. మూడో టెస్టు ఆరంభానికి ముందు ఈసీబీ చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ‘సిల్వర్ స్టాంప్’ జ్ఞాపికను బ్రాడ్‌కు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment