జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నేడు
నెల్లూరు (పొగతోట): నగరంలోని జెడ్పీ కార్యాలయంలో స్థాయీ సంఘ సమావేశాలను శుక్రవారం నిర్వహించనున్నామని సీఈఓ విద్యారమ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశాలకు ఆయా శాఖల జిల్లా అధికారులు, సభ్యులు తప్పక హాజరుకావాలని కోరారు.
ఆర్పీ సిసోడియాతో భేటీ
నెల్లూరు(అర్బన్): రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ్‌ప్రసాద్ సిసోడియా నగరానికి గురువారం చేరుకొని ఓ హోటల్లో బస చేశారు. ఆయనకు కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ పుష్పగుచ్ఛాలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలోని రెవెన్యూ సమస్యలపై చర్చించారు. రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు.
విజయదీపిక
పుస్తకాల అందజేత
సంగం: స్థానిక జెడ్పీ హైస్కూల్‌ను జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ గురువారం సందర్శించారు. పాఠశాలలో విద్యాబోధనపై ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు విజయదీపిక పుస్తకాలను అందజేసి, పరీక్షలను విజయవంతంగా రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని కాంక్షించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను ఆమెకు తెలియజేశారు. ఎంపీడీఓ షాలెట్, ఎంఈఓ మల్లయ్య పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలపై శిక్షణ రేపు
నెల్లూరు (టౌన్): ఇంటర్ పబ్లిక్ పరీక్షలపై నగరంలోని డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాలలో చీఫ్, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, కస్టోడియన్లకు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించనున్నామని ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్లకు కేంద్రానికి సంబంధించి పరీక్ష సామగ్రిని అందజేయనున్నామని వివరించారు.
ఏపీపీగా రఫీమాలిక్
నెల్లూరు (లీగల్): నెల్లూరు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు ఏపీపీగా సీనియర్ న్యాయవాది రఫీమాలిక్‌ను నియమిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం జారీ చేసింది. ఏపీపీగా మూడేళ్లు ఆయన కొనసాగనున్నారు. కాగా ఆయనకు పలువురు అభినందనలను తెలియజేశారు.
పెట్రోల్ కల్తీపై ఆందోళన
ఉలవపాడు: ఉలవపాడులోని హెచ్‌పీ అవుట్‌లెట్లో పెట్రోల్ కల్తీ జరిగిందంటూ వాహనదారులు ఆందోళనను గురువారం చేపట్టారు. కల్తీ పెట్రోల్‌తో తమ వాహనాలు ఆగిపోయాయని, మెకానిక్ వద్దకు తీసుకెళ్లగా ఇదే విషయాన్ని నిర్ధారించడంతో సుమారు 15 మంది వచ్చి యజమానులను నిలదీశారు. టెస్టింగ్ చేసే ఫిల్టర్ కాగితాన్ని దాదాపు గంట పాటు ఇవ్వలేదు. వాహనం నుంచి తీసిన పెట్రోల్‌తో పాటు అక్కడే మరో బాటిల్‌లో పట్టించారు. పరీక్షించాలని కోరగా, వారు నిరాకరించి ఏదో తప్పు జరిగిందని తెలియజేశారు. వాహనదారుల ఫిర్యాదుతో ఎస్సై అంకమ్మ వచ్చి తనిఖీ చేయాలని నిర్వాహకులను ఆదేశించడంతో పరీక్ష చేశారు. ఫిల్టర్ పేపర్‌పై పోయగా, మరకలతో తడి ఆరకుండా ఉండటంతో కల్తీ పెట్రోల్‌గా నిర్ధారించారు. కంపెనీ వారు వచ్చి తనిఖీ చేసి మార్చేంత వరకు బంక్‌ను మూసేయాలని ఆదేశించారు. ఈలోపు నిర్వాహకులు ప్రాధేయపడి, వారి వాహనాలను బాగు చేయించేలా మాట్లాడుకున్నారు. వీరికి నగదును ఇచ్చారని సమాచారం. కాగా పెట్రోల్ కల్తీపై విచారణ జరపాలంటూ హెచ్‌పీ సేల్స్ అధికారి, నెల్లూరు డీఎస్‌ఓకు ఫిర్యాదు చేశారు.
జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నేడు
జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నేడు
జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నేడు
Comments
Please login to add a commentAdd a comment