నెల్లూరు(అర్బన్): ఎంబీబీఎస్ ఫైనలియర్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో నగరంలోని ఏసీఎస్సార్ ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. 177 మంది వైద్య విద్యార్థులు పరీక్ష రాయగా, అందరూ ఉత్తీర్ణులై డాక్టర్ పట్టాను అందుకోనున్నారు. గతేడాది 164 మంది పరీక్షలు రాయగా, 154 మంది పాసై 93.9 శాతం విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది నూరు శాతం పాస్ కావడంతో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఘనత సాధించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ రాజమన్నార్ మాట్లాడారు. ఇదే స్ఫూర్తితో వైద్యకళాశాలను ముందుకు నడుపుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment