మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ గౌతమన్న ఆశయాలకు అనుగుణంగా ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో శ్రమించారని, వ్యవసాయ పరంగా, పారిశ్రామికంగా అన్నింటా నియోజకవర్గాన్ని ముందు స్థానంలో నిలబెట్టారన్నారు. మంత్రిగా మూడేళ్ల పాటు పదవిలో ఉన్నప్పటికీ 30 సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునేలా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రణాళికతో కూడిన అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. మాజీ మంత్రులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి తదితరులు గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలతోపాటు జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు పలు కీర్తనలు ఆలపించారు.
Comments
Please login to add a commentAdd a comment