
మచ్చలేని నాయకుడు గౌతమ్‌రెడ్డి
నెల్లూరు (బారకాసు): దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి రాజకీయాలకు అతీతంగా అందరివాడుగా, నిష్పక్ష పాతిగా, మచ్చలేని నాయకుడిగా ఎదిగారని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కొనియాడారు. నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డు సెంటర్‌లోని మేకపాటి స్వగృహంలో శుక్రవారం ఆయన తృతీయ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌతమ్‌రెడ్డి చిత్రపటం వద్ద తల్లిదండ్రులు మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి, మణిమంజరి దంపతులు, కుటుంబ సభ్యులు ఉదయగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, అభినవ్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి బంధుమిత్రులు నివాళులర్పించారు. రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి మరణం అత్యంత విషాదకరమన్నారు. తన కుమారుడు గౌతమ్‌రెడ్డి అకాల మరణం ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు తీరని లోటన్నారు. మూడేళ్లు అయినా ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు.
నిష్పక్ష పాతిగా, అందరివాడుగా ఎదిగారు
తృతీయ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
భారీగా తరలివచ్చిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు

మచ్చలేని నాయకుడు గౌతమ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment