● ఎంపీ వేమిరెడ్డి
కావలి: దగదర్తి విమానాశ్రయాన్ని 2027 నాటికి పూర్తి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు కలెక్టర్ ఆనంద్, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి విమానాశ్రయం నిర్మించే దామవరం వద్ద భూములను శుక్రవారం పరిశీలించారు. అధికారులతో ఎంపీ వేమిరెడ్డి చర్చించారు. రైతులకు సంబంధించి పరిహారం అంశంపై మాట్లాడుతూ 1,379 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని ప్లాన్ చేశారని, 669 ఎకరాలను ప్రభుత్వం సేకరించించగా, మరో 710 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఎయిర్‌పోర్ట్ స్థలం జాతీయ రహదారిని ఆనుకుని ఉందని, కార్గో, పాసింజర్ సేవలకు అవకాశం ఎక్కువ ఉందన్నారు. విమానాశ్రయానికి దగ్గరలోనే రెండు పోర్టులున్నందున ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా ఉంటుందని, ఈ ప్రాంతం పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భూసేకరణకు రూ.96 కోట్ల నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment