అక్రమంగా ఇసుక తరలిస్తుండగా..
● మైనింగ్ డీడీ దాడులు
● పలు వాహనాల సీజ్
పొదలకూరు: అనుమతి లేని రీచ్ నుంచి రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా మైనింగ్ అధికారులు దాడులు చేశారు. విరువూరు ఇసుక రీచ్‌కు మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ గురువారం వచ్చారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు, ఒక టిప్పర్, ఇసుక లోడింగ్ చేస్తున్న రెండు హిటాచీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ విరువూరు ఇసుక రీచ్‌పై కోర్టులో స్టే ఉందన్నారు. ఇక్కడి నుంచి ఎవరూ ఇసుకను తరలించేందుకు అనుమతుల్లేవన్నారు. పోతిరెడ్డిపాళెం, సూరాయపాళెం, సంగం ఇసుక డంపింగ్ యార్డులను తనిఖీ చేసి వెళ్తుండగా ఇసుక లారీలను గమనించి విరువూరు రీచ్‌కు వచ్చినట్లు తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్టు గుర్తించి రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం అందజేసి వాహనాలను సీజ్ చేశామన్నారు. వాటిని పొదలకూరు పోలీస్‌స్టేషన్లో అప్పగించడం జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment