పకడ్బందీగా గ్రూప్ – 2 మెయిన్స్
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: జిల్లాలో గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో పరీక్షల సమన్వయాధికారి, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, డీఆర్వో ఉదయభాస్కర్‌రావుతో కలిసి అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏడు కేంద్రాల్లో ఆదివారం ఉదయం, మధ్యాహ్నం పరీక్షలను నిర్వహించనున్నారని వెల్లడించారు. ఈ కేంద్రాలకు లైజనింగ్ అధికారులుగా ఏడుగుర్ని నియమించామని పేర్కొన్నారు. 4102 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, సీసీ కెమెరాల ఏర్పాటు తదితరాలను పర్యవేక్షించాలన్నారు. సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలు తెరుచుకోకుండా, 144 సెక్షన్‌ను అమలు చేయాలని చెప్పారు. సెల్‌ఫోన్లను పరీక్ష కేంద్రంలో డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ కృష్ణవేణి, సెక్షన్ అధికారులు అంజన, రమణ, లైజనింగ్ అధికారులు శ్రీధర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment