అంబేడ్కర్ విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం..
ఆంధ్రప్రదేశ్‌లో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం లేకపోవడంతో దూర విద్య విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని రీజినల్ కో–ఆర్డినేటర్ సెంటర్లలో పనిచేసే సిబ్బంది ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌కు చెందినందున ఈ సంవత్సరం ఏపీలో అడ్మిషన్లు నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గడిచిన మూడేళ్లుగా మన రాష్ట్రంలోని సెంటర్లలో పనిచేస్తున్న పార్ట్‌టైం లెక్చరర్లకు, సిబ్బందికి జీతాలు కూడా నిలిపివేసినట్లు చెప్పారు. అడ్మిషన్లను చేపట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment