
నా భూమిని కాపాడమని తిరుగుతున్నా
నాకు నలుగురు ఆడ పిల్లలు. అనంతపురంలో సుమారు 6 ఎకరాల వరకు బిట్లు, బిట్లు గా పొలం ఉంది. కొంత మంది నా పొలాన్ని, ఇంటిని ఆక్రమించాలని చూస్తున్నా రు. కిష్టమ్మ, రఘురామిరెడ్డి 1.70 ఎకరాలు ఆక్రమించారు. బావి దగ్గరకు పోనివ్వడం లేదు. పొలానికి వెళ్లే కాలువను తెగ్గొట్టారు. పోలా సురేష్, దశయ్య, మరికొంత భూమిని ఆక్రమించారు. నేను వయోభారంతో ఉండడంతో ఇబ్బంది పెడుతున్నా రు. నా బాధ కలెక్టర్‌కు మొర పెట్టుకున్నాను. తహసీల్దార్‌కు ఫోన్ చేశారు. అయితే మా గ్రామంలో కొంత మంది ఒత్తిడి వల్ల స్థానిక అధికారులు పట్టించుకోలేదు. నాలుగో దఫా కలెక్టరేట్‌కు వచ్చాను.
– కాకు మాలకొండారెడ్డి,
అనంతపురం, కలిగిరి మండలం
●