
‘జన్మదిన్’ పాఠ్యాంశంపై షార్ట్ ఫిల్మ్
కొడవలూరు: మండలంలోని గండవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి హిందీ పాఠ్య పుస్తకంలోని ‘జన్మదిన్’ పాఠ్యాంశాన్ని హిందీ పండిట్ జి.నాగభూషణం దర్శకత్వంలో విద్యార్థులే నటులుగా షార్ట్ ఫిల్మ్‌ను గురువారం చిత్రీకరించారు. ఈ సందర్భంగా హిందీ పండిట్ మాట్లాడుతూ పాఠ్యాంశాన్ని దృశ్య రూపకంలో చూడడం వల్ల విద్యార్థులు సులువుగా అర్థం చేసుకోవడంతో పాటు భాషా సామర్థ్యం పెరుగుతుందన్నారు. అంతేకాకుండా ఎక్కువ కాలం గుర్తిండిపోతుందన్నారు. దీనిని యూట్యూబ్‌లో కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థిని చిత్ర పుట్టినరోజును నిర్వహించారు. హెచ్‌ఎం జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందీ పండిట్ ఇప్పటికే అనేక హిందీ పాఠ్యాంశాలను దృశ్య రూపకంతో అందుబాటులోకి తెచ్చారన్నారు.