
గనుల్లో ఇష్టానుసారంగా మైనింగ్
నెల్లూరు రూరల్: సైదాపురం మండలంలో అనుమతి లేని క్వార్ట్ ్జ గనుల్లో ఇష్టానుసారంగా మైనింగ్ చేస్తున్నారని రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్‌పర్సన్ పొట్టేళ్ల శిరీష విమర్శించారు. గురువారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్న వెంకటగిరి రాజా, మరొకరికి సంబంధించిన మైన్స్‌ను మూసి వేయించారన్నారు. లీజు గడువు ముగిసి పర్యావరణ అనుమతుల్లేని పద్మావతి మైన్స్, సిద్ధి వినాయక మైన్స్‌కు స్టాక్ పాయింట్లు ఇచ్చారన్నారు. రూల్స్ ప్రకారం 50 సంవత్సరాలు ముగిశాక ఆక్షన్ పద్ధతిలో టెండర్లు పిలవాల్సి ఉండగా జిల్లా అధికారులు అలా చేయకుండా దరఖాస్తును డీఎంజీకి పంపారన్నారు. కానీ ఐఏఎస్ అధికారుల నిజాయితీ వల్ల అప్పట్లో తిరస్కరించారన్నారు. పద్మావతి మైన్స్‌పై రూ.32 కోట్లు డిమాండ్ నోటిసు ఉందని తెలిపారు. వీటికి స్టాక్ పాయింట్ల నుంచి మెటీరియల్‌ను తరలించడానికి అధికారులు ఎలా అను మతి ఇచ్చారో చెప్పాలన్నారు. రూ.32 కోట్లను ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారో డీడీ బాలాజీ నాయక్ చెప్పాలన్నారు. అప్పట్లో విజిలెన్స్ ఏడీగా ఉన్న బాలాజీ నాయక్, మరో అధికారి సుధాకర్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వాళ్ల తో కలిసి పద్మావతి మైన్స్‌లో గత మేలో 38 వేల టన్నుల మెటీరియల్ ఉందని పంచనామా నిర్వహించారన్నారు. ఈ ఫిబ్రవరిలో 1.55 లక్షల స్టాక్ ఉందని అంటున్నారని, మూసివేసిన గనుల్లో ఇదెలా సాధ్య మని ప్రశ్నించారు. పద్మావతి మైన్స్ డైరెక్టర్ శోభారాణి జనవరి 20న స్టాక్ పాయింట్ తరలించాలని డీఎన్‌డీకి పర్మిషన్ పెట్టారన్నారు. 22వ తేదీన వారు రిజెక్ట్ చేశారన్నారు. కానీ విచిత్రంగా అదే డీఎంజీ ఫిబ్రవరి 26న ఎలా పర్మిషన్ ఇచ్చిందో అర్థం కావడం లేదన్నా రు. సైదాపురం మండలంలో వెంటనే అనుమతులు ఉన్న గనులను తెరిపించాలన్నారు, లేనిపక్షంలో ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాడుతుందన్నారు.