
అవమానాన్ని తట్టుకోలేక..
కొండాపురం: అవమానాన్ని తట్టుకోలేక కొండాపురం మండలంలోని కొమ్మిపాళేనికి చెందిన నాగరాజు (40) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడి బంధువుల వివరాల మేరకు.. బేల్దారి పనుల నిమిత్తం తిరుపతిలో నాగరాజు ఉంటున్నారు. ఇటీవల ఆయన తమ్ముడు పోతురాజు దగదర్తికి చెందిన ఓ వివాహితను తీసుకొని ఆయన ఇంటికెళ్లారు. విషయం తెలుసుకున్న మహిళ బంధువులు తిరుపతి వెళ్లి అక్కడ గొడవ చేసి.. పోలీస్‌స్టేషన్లో పంచాయితీ పెట్టారు. ఈ ఘటనను తలవంపుగా భావించిన ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.