
న్యాయమూర్తులకు ఆత్మీయ వీడ్కోలు
నెల్లూరు(లీగల్): ఇటీవల బదిలీ అయిన నెల్లూరు 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.అఖిల, 5వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ కోర్టు జి.దేవికకు నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానం నిర్వహించారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యా యమూర్తి జి.శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇద్దరు న్యాయమూర్తులు కేసుల పరిష్కారంలో ప్రతిభ చూపించాలని కొనియాడారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, బార్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్‌రెడ్డి, సుందరయ్య యాదవ్ మాట్లాడారు.