
ట్రాక్టర్ ఢీకొని..
● ఒకరు మృతి
వలేటివారిపాళెం: ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన మండలంలోని అంకభూపాలపురం పెట్రోల్ బంక్ సమీపంలో 167బీ హైవేపై సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అత్తంటివారిపాళేనికి చెందిన కొల్లూరి మాధవరావు (48) మరో ఇద్దరు కలిసి బైక్‌పై పామూరు వెళ్తున్నారు. గ్రావెల్ కోసం ట్రాక్టర్ లింగపాళెం వెళ్తోంది. హైవే క్రాస్ చేస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. మాధవరావు రోడ్డుపై పడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎస్సై మరిడి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. మాధవరావు తండ్రి నరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.