
లక్షలు
పుట్టపర్తి అర్బన్: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదలకిచ్చే బియ్యం కార్డుల మంజూరు ప్రక్రియ సులభతరం చేసింది. అర్హత ఆధారంగా వెంటనే మంజూరు చేస్తోంది. వలంటీర్లే ఇంటింటికీ తిరిగి అర్హులను గుర్తించి దరఖాస్తు చేయిస్తున్నారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారుల నుంచి తీసుకొని వారే సచివాలయాల్లో అందిస్తూ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయిస్తున్నారు.
అర్హత ఉంటే... అడిగిన వెంటనే మంజూరు
గత నెలలో జిల్లా వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’కార్యక్రమాన్ని నిర్వహించగా, బియ్యంకార్డుల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అర్హులను గుర్తించిన అధికారులు 3,384 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేశారు. అలాగే రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగాలే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈక్రమంలో కొత్తగా పెళ్లయిన దంపతులు, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరు కాపురం పెట్టిన వారు దరఖాస్తు చేయగానే కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 32 మండలాల పరిధిలో 5,60,914 రేషన్ కార్డులున్నాయి. ఈ కార్డుల ద్వారా ప్రతి నెలా 8,700 మెట్రిక్ టన్నుల బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు. తక్కువ ధరకే పంచదార, కందిపప్పు, రాగులు, పట్టణ ప్రాంతాల్లో గోధుమపిండి, తదితర సరుకులను ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే చేరుస్తున్నారు.
నేటి నుంచి పంపిణీ
కొత్త బియ్యం కార్డులను ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా వలంటీర్లను లబ్ధిదారుల ఇళ్లకు పంపి కార్డు అందించడం, లేదా సచివాలయాలకు పిలిపించి ఇవ్వాలని భావిస్తున్నారు. లబ్ధిదారు సచివాలయానికి వెళ్లగానే కార్డు ప్రింట్ తీసి వెంటనే అందజేస్తారు. కొత్త కార్డులకు ఈ నెలలోనే పంపిణీ చేయడానికి అవసరమైన బియ్యం, రాగులు, చక్కెర, కంది బేడలను అధికారులు సరఫరా చేశారు. జిల్లాలో 1,367 చౌక దుకాణాలుండగా, ఇంటి వద్దనే బియ్యం అందించేందుకు 349 వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
కొత్తకార్డులకూ సరుకులిస్తాం
జిల్లాలో కొత్తగా 3,384 కుటుంబాలకు బియ్యం కార్డులు మంజూరయ్యాయి. వారికి కూడా ఆగస్టు కోటా అందజేసేందుకు అవసరమైన సరుకులు డీలర్లుకు సరఫరా చేశాం. నూతన కార్డుదారులు బుధవారం నుంచి బియ్యం, రాగులు సైతం తీసుకెళ్లవచ్చు. వారికి కూడా ఫోర్టిఫైడ్ బియ్యాన్నే అందజేస్తారు. ప్రస్తుతం జిల్లాలోని 5.60 లక్షల కార్డులకు 8,700 మెట్రిక్ టన్నుల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. – వంశీకృష్ణారెడ్డి,
జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి
5.60
బి
3,384
8,700
నూతన బియ్యం కార్డులు మంజూరు
సచివాలయాల్లో
లబ్ధిదారులకు అందజేత
ఈ నెల నుంచే
రేషన్ సరుకుల పంపిణీ
కొత్తగా మంజూరైన కార్డులు
మెట్రిక్ టన్నులు
ప్రతి నెలా ప్రభుత్వం ఇస్తున్న బియ్యం
య్యం కార్డు పొందాలంటే గతంలో సవాలక్ష నిబంధనలు. అర్హతలున్నా కార్యాలయాల చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు చేస్తేగానీ మంజూరు అయ్యేది కాదు. సచివాలయ వ్యవస్థతో ఇప్పుడంతా మారిపోయింది. అర్హత ఉంటే చాలు వలంటీర్‌కు దరఖాస్తు ఇస్తే వెంటనే కార్డు మంజూకు అవుతోంది. అదే నెలలో రేషన్ కోటా కూడా అందిస్తున్నారు. తాజాగా జిల్లాకు 3,385 కార్డులు మంజూరు కాగా లబ్ధిదారులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తు చేసిన వెంటనే మంజూరు
రేషన్ కార్డు మంజూరుకాక గతంలో చాలా ఇబ్బంది పడ్డాం. ప్రస్తుతం సచివాలయంలో వలంటీర్ ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా. వెంటనే కార్డు మంజూరు చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. ‘జగనన్న సురక్ష’చాలా మంచి కార్యక్రమం. ఎందరికో మేలు జరిగింది.
– సుబ్బమ్మ, కర్ణాటకనాగేపల్లి, పుట్టపర్తి
ధర్మవరానికి అత్యధికం
నూతన రేషన్ కార్డులు అత్యధికంగా ధర్మవరం మండలానికి 291 మంజూరయ్యాయి. ఆ తర్వాత హిందూపురం అర్బన్ 188, ముదిగుబ్బ 153, గోరంట్ల 151, పుట్టపర్తి 144, తనకల్లు 132, ఓడీ చెరువుకు 131, చెన్నేకొత్తపల్లి 130, తాడిమర్రి 121, కనగానపల్లి 116, మడకశిర 116, పెనుకొండ 110, బత్తలపల్లి 107, కదిరి 104 కార్డులు మంజూరయ్యాయి.


