డ్రోన్ కెమెరాలతో నేరాలు నియంత్రిస్తాం
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులకు డ్రోన్‌లు ఎలా వినియోగించాలి? అన్న అంశాలను వివరించి అనంతరం పరేడ్ మైదానంలో సిబ్బంది కలిసి డ్రోన్ల ఆపరేటింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చైన్ స్నాచింగ్స్, ఈవ్‌టీజింగ్, రహదారి ప్రమాదాలు, కోడి పందాలు, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలను ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాల్లోకి డ్రోన్ కెమెరాలను పంపి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ, మహిళలపై దాడులు నియంత్రించేందుకు, సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచేందుకు డ్రోన్స్ వినియోగించుకుంటామన్నారు. డ్రోన్స్ ఎలా వినియోగించాలనే అంశాలపై పోలీస్ సిబ్బంది శిక్షణ కూడా ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీలు విజయకుమార్, వెంకటేశ్వర్లు, ఏఆర్ డీఎస్పీ విజయ్‌కుమార్, ఎస్బీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్, ఆర్‌ఐలు వలి, మహేష్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ రత్న
Comments
Please login to add a commentAdd a comment