17న కదిరిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
కదిరి అర్బన్: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 17న కదిరిలో రెవెన్యూ డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతివారం ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 17న కదిరి ఆర్డీఓ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చేతన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజల తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలని సూచించారు.
తపశ్య గానం.. సమ్మోహనం
ప్రశాంతి నిలయం: దేవదేవుళ్లను కీరిస్తూ విధుషీ శ్రీరంజని తపశ్య నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను సమ్మోహనభరితులను చేసింది. విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రశాంతి నిలయంలో చేపట్టిన అతిరుద్ర మహాయాగం రెండోరోజూ కొనసాగింది. చైన్నెకి చెందిన శ్రీనివాస్ శర్మ నేతృత్వంలోని రుత్వికుల బృందం ఉదయం గణపతి ప్రార్థనతో ప్రారంభించి మహాన్యాస పారాయణం, షోడశ ఉపచార పూజ, రుద్రపారాయణం, రుద్రాభిషేకం, రుద్రహోమం నిర్వహించారు. వేదపఠనంతో రుత్వికులు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. సాయంత్రం కర్మార్చనం, అష్టావధాన సేవ నిర్వహించారు. పుదిచ్చేరి యూనివర్సిటీ సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్ రాధాకృష్టన్ అతి రుద్రమహా యజ్ఞం విశిష్టతను వివరించారు. అనంతరం విధుషీ శ్రీరంజని శంతనగోపాలన్ తపశ్య బృందం సంగీత కచేరీ నిర్వహించారు. చక్కటి స్వరాలతో దేవదేవుళ్లను కీర్తిస్తూ సాగిన కచేరీతో భక్తులు మైమరచిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment