గ్రామాలను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలి
● కలెక్టర్ చేతన్ పిలుపు
పుట్టపర్తి అర్బన్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ గ్రామాలను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చేతన్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన డీఈఓ కృష్ణప్పతో కలిసి మండల పరిధిలోని పెడపల్లి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో న్యూట్రి గార్డెన్, వంటగది, స్టోర్ రూం, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు రక్షిత తాగునీరు అందజేయాలన్నారు. న్యూట్రి గార్డెన్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించి వన సంరక్షణ బాధ్యతలను అప్పగించాలన్నారు. సర్వ శిక్ష అభియాన్ ద్వారా పాఠశాలలో తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేయాలని డీఈఓను ఆదేశించారు. అలాగే స్వచ్ఛంధ్రా లక్ష్య సాధనలో ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. పేరుకు పోయిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించాలన్నారు. చెత్త కాగితాలు, వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కాగితాలను పూర్తిగా తొలగించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ శుభదాస్, హెచ్‌ఎం రమామణి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీల్లో రూపశ్రీ సత్తా
● స్కిప్పింగ్ పోటీల్లో ద్వితీయ స్థానం కై వసం
అమరాపురం: మండల పరిధిలోని హలుకూరు సమీపంలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థి రూపశ్రీ జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన రోప్ స్కిప్పింగ్ పోటీల్లో ద్వితీయ స్థానం దక్కించుకుంది. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రూపశ్రీ జాతీయ స్థాయిలో రాణించడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ పద్మావతి, పీడీ రోజా అన్నారు. రూపశ్రీ స్ఫూర్తితో గురుకుల పాఠశాలకు చెందిన మరింత మంది విద్యార్థులు క్రీడల్లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రామాలను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలి
Comments
Please login to add a commentAdd a comment