పింఛన్ సరిపోవడం లేదు
నేను ఏడేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నా. హిందూపురం ఆస్పత్రిలో డయాలసిస్ మాత్రమే చేస్తున్నారు. మందులు మాత్రం బయట కొనుక్కోవాలని చెబుతున్నారు. ఇందుకు నెలకు రూ. 5 వేలు ఖర్చవుతోంది. దీనికి తోడు ఆస్పత్రికి వచ్చి వెళ్లేందుకు భారీ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. వచ్చే పింఛన్ సొమ్ము వాటికే సరిపోతోంది. ఏ పనీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న నా లాంటి వారికి ప్రభుత్వం రవాణా ఖర్చులైనా అదనంగా ఇచ్చి ఆదుకోవాలి. ఇందుకోసం పింఛన్ మొత్తం పెంచాలి.
– గోపాల్, కిరికెర, హిందూపురం
Comments
Please login to add a commentAdd a comment