వైభవంగా వసంతోత్సవం
లేపాక్షి: శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో శివపార్వతులకు వసంతోత్సవం నిర్వహించారు. నాట్యమంటపంలో శివపార్వతుల ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి విశేషంగా పూజలు చేశారు. వేదపండితులు హోమాలను నిర్వహించి గ్రామానికి, ప్రజలకు మంచి జరగాలని ఆ దేవదేవుడిని వేడుకున్నారు. అదేవిధంగా ఆలయంలో ధ్వజాఅవరోహణ కార్యక్రమం, సాయంత్రం శయనోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించి మహాశివరాత్రి ఉత్సవాలకు ముగింపు పలికారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానందన్, ఈఓ నరసింహమూర్తి, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వైభవంగా వసంతోత్సవం
వైభవంగా వసంతోత్సవం
Comments
Please login to add a commentAdd a comment