మహిళ సాధికారతతోనే సమాజాభివృద్ధి
ప్రశాంతి నిలయం: మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించగా, గణేష్ సర్కిల్ వరకూ కొనసాగింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమాజంలో మహిళల ప్రాధాన్యత, మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం, బాల్య వివాహాల అనర్థాలను వివరిస్తూ నినాదాలు చేశారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై హింసను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఐసీడీఎస్ పీడీ సుధా వరలక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా మార్చి 8వ తేదీ వరకూ నిర్వహిస్తున్నామన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫిరోజ్ బేగం, సీడీీపీఓ గాయత్రి, జిల్లా కో ఆర్డినేటర్ సురేష్ కుమార్, నాగలక్ష్మి, పీఓ మురశీధర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
గోరంట్ల: బూచేపల్లిలో ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సీఐ బోయ శేఖర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతు శివప్ప (33) ఇటీవల తన పొలంలో బోరు వేశాడు. దీంతో కట్టెలపై తాత్కాలికంగా విద్యుత్ కేబుల్‌ను లాగాడు. శనివారం విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో కట్టైపె ఉన్న కేబుల్‌ను పరిశీలించేందుకు యత్నించాడు. కేబుల్ దెబ్బతిన్న చోట తాకడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
మహిళ సాధికారతతోనే సమాజాభివృద్ధి
Comments
Please login to add a commentAdd a comment