9 నుంచి ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఖాద్రీ ఆలయంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అందరం సమష్టిగా పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయంతం చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ఖాద్రీశుని బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ వీవీఎస్ శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ, ప్రధాన అర్చకులు పార్థసారథి ఆచార్యులు, నరసింహాచార్యులు, అంజన్‌కుమార్ స్వామి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్క్రీనింగ్ పరీక్షలు
సజావుగా జరగాలి
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం
పుట్టపర్తి అర్బన్: సంక్రమిత, అసంక్రమిత వ్యాధులను గుర్తించేందుకు గ్రామాల్లో జరుగుతున్న స్క్రీనింగ్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం ఆదేశించారు. శనివారం ఆమె పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో జరుగుతున్న స్క్రీనింగ్ పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్క్రీనింగ్ సమయంలో ప్రతి ఇంటినీ సందర్శించాలని, ఆయా కుటుంబాల్లోని ప్రతి ఒక్కరినీ పరీక్షించాలన్నారు. అలాగే ప్రతి కేసునూ నమోదు చేయాలన్నారు. డీఎంహెచ్‌ఓ వెంట జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి, వైద్యాధికారి డాక్టర్ జ్యోత్స్న, సూపర్‌వైజర్ రమణ, ఎంఎల్‌హెచ్‌పీ సత్యమ్మ తదితరులు ఉన్నారు.
9 నుంచి ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment