ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేస్తే ఊరుకోం : యూటీఎఫ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేస్తే ఊరుకోం : యూటీఎఫ్‌

Published Mon, Mar 3 2025 12:51 AM | Last Updated on Mon, Mar 3 2025 12:51 AM

-

పుట్టపర్తి: పంచాయతీకి ఒక మోడల్‌ పైమరీ స్కూల్‌ పేరుతో ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేస్తామంటే ఊరుకోబోమంటూ కూటమి ప్రభుత్వాన్ని జిల్లా యూటీఎఫ్‌ అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి సుధాకర్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒక పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5వ తరగతులను మోడల్‌ ప్రైమరీ పాఠశాల పేరుతో ఓ పాఠశాలకు విలీనం చేసేందుకు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలతో తీర్మానాలు చేయించాలంటూ విద్యాశాఖ ఆదేశించడాన్ని వారు తప్పు బట్టారు. ఈ విలీన ప్రక్రియపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ అభిప్రాయాలను స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా తమకు అనుకూలమైన రీతిలో తీసుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ కుట్రకు స్వస్తి పలకాలని డిమాండ్‌ చేశారు. 50 మందికి పైగా ద్యార్థులున్న ప్రతి పాఠశాలను మోడల్‌ పాఠశాలగా మార్చి, 50 మంది విద్యార్థులున్న మిగిలిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను యథాతథంగా ఉంచాలన్నారు.

యువకుడి దుర్మరణం

హిందూపురం: స్థానిక ఆటో నగర్‌కు చెందిన చాంద్‌ (30) ఆదివారం రాత్రి ట్రాక్టర్‌ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. చౌళూరు గ్రామంలో బంధువుల ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై హిందూపురం రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement