తాడిపత్రి రూరల్: మండలంలోని చుక్కలూరు సమీపంలోని నల్లబండల యూనిట్‌కు చెందిన నీటి కుంటలో పడి మూడేళ్ల చిన్నారి మృతిచెందాడు. వివరాలు... పామిడికి చెందిన గంగారాజు, తన కుటుంబసభ్యులతో కలసి బండల పాలీసు యూనిట్‌లో పనిచేస్తున్న చెల్లెలు ఇంటికి ఇటీవల వచ్చాడు. ఈ నేపథ్యంలో యూనిట్ వద్ద ఇన్‌ఫిల్‌స్ట్రేషన్ గుంత వద్ద అడుకుంటున్న గంగరాజు కుమారుడు గౌతమ్‌నందా (3) ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు గుంతలో పడిన చిన్నారిని వెలికి తీసి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment