
సకల కళావల్లభుడు ఈ ’భాస్కరుడు’
కదిరి టౌన్: గ్రామీణ సాంస్కృతిక కళలు కనుమరుగువుతున్న ప్రస్తుత రోజుల్లో వాటి పరిరక్షణకు పరితపించిపోతున్నాడు కదిరికి చెందిన యర్రగుడి భాస్కర్. కళలే తన ప్రాణంగా భావిస్తూ కొన్ని సంవత్సరాలుగా నటుడిగా, తబలిస్టుగా, డప్పిస్ట్‌గా, గాయకుడిగా ఆయన రాణిస్తున్నారు. తాను నమ్ముకున్న కళ తనతోనే అంతరించి పోకూడదన్న లక్ష్యంతో 20 మంది ఔత్సాహిక కళాకారులను నిష్ణాతులుగా తీర్చి దిద్దుతున్నారు. కదిరిలోని గంగిరెడ్డిపల్లి కాలనీలో నివాసముంటున్న ఆయన చిన్నమ్మ కథలో తలారి, రాఘవరెడ్డి పాత్రలకు పెట్టింది పేరుగా ఖ్యాతిగాంచారు. ఏటా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉచిత ప్రదర్శనలిస్తూ వేలాది భక్తులకు వినోదాన్ని పంచుతుంటారు. ఆయన సేవలకు ప్రతిగా ఆలయ అధికారులు పలు ప్రశంసాపత్రాలను అందజేసి సత్కరించారు. కళలను ప్రోత్సహించాలని, కళాకారులకు రుణ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన కోరుతున్నారు.

సకల కళావల్లభుడు ఈ ’భాస్కరుడు’

సకల కళావల్లభుడు ఈ ’భాస్కరుడు’

సకల కళావల్లభుడు ఈ ’భాస్కరుడు’
Comments
Please login to add a commentAdd a comment