
తాగునీటి ఎద్దడి తలెత్తకూడదు
ప్రశాంతి నిలయం: వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు, ఎంఎస్‌ఎంఈ సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... తాగునీటి పైప్‌లైన్లను తనిఖీ చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో రానున్న మూడు నెలలూ నీటి ఎద్దుడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. బోరు బావులు, చేతి పంపులను మరమ్మతులు చేపట్టాలన్నారు. ఎంఎస్‌ఎంఈ సర్వే వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయ సారథి, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment