హిందూపురం అర్బన్: స్థానిక బంగారు దుకాణాల్లో సోమవారం కర్ణాటక పోలీసులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో దొంగలించిన బంగారాన్ని హిందూపురంలోని రెండు దుకాణాల్లో విక్రయించినట్లుగా పట్టుబడిన నిందితుడి సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. అయితే ఎంత బంగారం దొంగలించారు? ఎవరు కొన్నారు? అనే వివరాలు వెల్లడించేందుకు కర్ణాటక పోలీసులు విముఖత వ్యక్తం చేశారు.
హెచ్‌ఎం సెల్‌ఫోన్ చోరీ
పెనుకొండ: బస్సు ఎక్కబోతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను దుండగులు అపహరించారు. వివరాలు... రొద్దం మండలం పెదకోడిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం హరినాయక్ సోమవారం మధ్యాహ్నం పాఠశాలకు సెలవు పెట్టి అనంతపురం వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పెనుకొండలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రైవేట్ బస్సును ఎక్కుతున్న సమయంలో ఓ యువకుడు ఆయన జేబులోని సెల్‌ఫోన్‌ను అపహరించాడు. విషయాన్ని పసిగట్టిన హెచ్‌ఎం వెంటనే ఆ యువకుడిని పట్టుకోవడంతో స్థానికులు చుట్టుముట్టి సెల్‌ఫోన్ గురించి ఆరా తీశారు. యువకుడు తనకు తెలియదని బుకాయించాడు. దీంతో సదరు యువకుడిని ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్ వద్ద ఆటో దిగిన యువకుడు అందరినీ పక్కకు తోసి ఒక్కసారి శ్రీరాములయ్య కాలనీ వైపు ఉడాయించి తప్పించుకున్నాడు. బాధిత హెచ్‌ఎం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment