లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి చొరవ తీసుకోండి
● ఎస్పీ రత్న ఆదేశం
పుట్టపర్తి టౌన్: ఈ నెల 8న జరిగే జాతీయ మెగా లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చొరవ తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ రత్న ఆదేశించారు. మంగళవారం డీపీఓ నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఆమె మాట్లాడారు. రాజీ చేయదగిన క్రిమినల్, సివిల్, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసుల్లో ఇరుపక్షాల సమ్మతితో వారి కేసులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ కేసుల పరిష్కారానికి చొరవ తీసుకున్న సిబ్బందికి ప్రోత్సాహాకాలు అందజేస్తామన్నారు.
జూదరుల అరెస్ట్
కదిరి అర్బన్: మండలంలోని ముత్యాలచెరువు వద్ద పేకాట ఆడుతున్న ఆరుగురుని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1,05,500 నగదు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కదిరి రూరల్ అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. అందిన సమాచారం మేరకు మంగళవారం తనిఖీలు చేపట్టి జూదరులను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
హిందూపురం అర్బన్: స్థానిక సత్యనారాయణ పేటకు చెందిన ఇంద్రనాథ్‌గుప్తా (55) హిందూపురం రైల్వే స్టేషన్‌లో ఒకట ప్లాట్‌ఫారమ్ నుంచి రెండో ప్లాట్‌ఫారమ్ వైపుగా పట్టాలు దాటుతుండగా బెంగళూరు నుంచి వస్తున్న వందే భారత్ రైలు ఢీకొని మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం 5.10 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. బరువు ఎక్కువగా ఉన్న ఆయన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కలేక పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
వృద్ధుడి ఆత్మహత్య
హిందూపురం: మండలంలోని దేవరపల్లి గ్రామానికి చెందిన బి.అంజినప్ప(60) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన అంజినప్ప వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజూ తన రేషం షెడ్డు వద్ద పడుకునేవాడు. ఈ క్రమంలోనే ఒంటరి తనాన్ని తాళలేక మంగళవారం రేషం షెడ్డులోనే పైకప్పునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న హిందూపురం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కర్ణాటక మద్యం స్వాధీనం
హిందూపురం టౌన్: హిందూపురం ఎకై ్సజ్‌స్టేషన్ పరిధిలో దాడులు చేసి కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. మంగళవారం ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోచనపల్లి నుంచి హిందూపురానికి వెళ్లే రహదారిలో పెన్నా నది బ్రిడ్జి వద్ద మంగళవారం చాకలికుంటకు చెందిన రాకేష్ వద్ద నుంచి 11 బాక్సుల్లోని 1059 టెట్రాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment