226 | - | Sakshi
Sakshi News home page

226

Published Wed, Mar 5 2025 12:10 AM | Last Updated on Wed, Mar 5 2025 12:09 AM

226

226

జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలు

ఆకలితో ఉన్నాం.. పచ్చడి మెతుకులు పెట్టమంటే... ఆర్నెల్లు ఆగు బిర్యానీ పెడతానన్నట్లుగా ఉంది కూటమి సర్కార్‌ తీరు. గ్రామంలో ఇంటికి సమీపంలో ఉన్న పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించమని అడుగుతుంటే...పంచాయతీకో ‘మోడల్‌ ప్రైమరీ స్కూల్‌’ అంటూ అరచేతిలో వైకుంఠం చూపుతోంది. 50 మందిలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసేందుకు సిద్ధమైంది. అదే జరిగితే ఆయా గ్రామాల్లోని విద్యార్థులు చదువుకునేందుకు కి.మీ దూరంలోని పాఠశాలకు రోజూ పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

కూటమి ప్రభుత్వం మోడల్‌ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు పేరుతో ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ విధానానికి స్వస్తి చెప్పకపోతే ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుంది. పంచాయతీకో మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ ఏర్పాటు వల్ల 50 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు మూతపడతాయి. అలా కాకుండా 50 మంది విద్యార్థులకంటే అధికంగా ఉన్న అన్ని పాఠశాలలను మోడల్‌ స్కూళ్లుగా మార్చాలి.

– పీవీ రమణారెడ్డి, వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం పంచాయతీకో మోడల్‌ స్కూల్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదన విరమించుకోకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. మోడల్‌ స్కూళ్ల ఏర్పాటు పేరుతో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు, విద్యార్థుల తల్లిదండ్రులతో బలవంతంగా తీర్మానాలు చేయించటం సరైంది కాదు. విద్యార్థుల ఇబ్బందులు పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా పాఠశాలల విలీనంపై ముందుకు వెళితే ఆందోళన తీవ్రతరం చేస్తాం. – శెట్టిపి జయచంద్రారెడ్డి,

యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి పంచాయతీ పరిధిలోని జానకంపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 21 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఇద్దరు టీచర్లు ఉన్నారు. ప్రభుత్వం ‘మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల’ ఏర్పాటుకు సిద్ధం కాగా, నిబంధనల మేరకు 50 మందికిపైగా విద్యార్థులున్న బుచ్చయ్యగారిపల్లి పాఠశాలను ‘మోడల్‌ స్కూల్‌’గా మారుస్తారు. అంతేకాకుండా జానకంపల్లి ప్రాథమిక పాఠశాలను ‘మోడల్‌’లో విలీనం చేస్తారు. దీంతో ప్రస్తుతం జానకంపల్లి స్కూల్లో ఉన్న విద్యార్థులు 4 కి.మీ దూరంలోని బుచ్చయ్యగారిపల్లి ‘మోడల్‌ స్కూల్‌’కు నడిచి వెళ్లాలి. లేదా బుక్కపట్నంలోని పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది.

● చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దలలో మోడల్‌ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేస్తే ఆ పంచాయతీలోని హరియాన్‌చెరువు, చిన్నపల్లి పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు 2 నుంచి 4 కిలోమీటర్ల మేర దూరం నడుచుకుంటూ న్యామద్దలకు రావాల్సి వస్తుంది.

... ఇలా ‘మోడల్‌ ప్రైమరీ’ స్కూళ్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు మూసివేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ప్రభుత్వం అనుకున్న ప్రకారం జరిగితే నిరుపేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారనుంది.

పుట్టపర్తి: వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘నాడు– నేడు’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దితే...కూటమి సర్కార్‌ ప్రభుత్వ పాఠశాలల మూతకు రంగం సిద్ధం చేస్తోంది. మోడల్‌ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు పేరుతో పంచాయతీలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసి వేసేందుకు కుట్ర పన్నుతోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తే 1,527 ప్రైమరీ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది.

పేద విద్యార్థులకు చదువు దూరం చేసే కుట్ర

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పేద విద్యార్థులు ప్రభుత్వ బడులలో చదివేందుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించింది. పాఠశాలలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిడంతో పాటు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ‘జగనన్న విద్యాకానుక’ పేరుతో నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్‌, షూ, టై తదితర వాటినన్నీ అందించింది. అలాగే ‘జగనన్న అమ్మఒడి’ పేరుతో ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తూ పేదింట చదువుల వెలుగులు ప్రసరించేలా చేసింది. దీంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ‘డ్రాపౌట్‌’ల సంఖ్య భారీగా తగ్గింది. కానీ కూటమి సర్కార్‌ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కార్పొరేట్‌కు కొమ్ముకాస్తూ ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం మోడల్‌ ప్రైమరీ పాఠశాలలు అంటూ కొత్త ఎత్తుగడ వేసింది. పంచాయతీకో మోడల్‌ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేస్తే జిల్లాలో 1,527 ప్రైమరీ స్కూళ్లపై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పాఠశాలకు తాళం తప్పదా?

పంచాయతీకో మోడల్‌ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేయటం వల్ల ఆయా పంచాయతీల్లోని మిగిలిన పాఠశాలలు మూతపడనున్నాయి. ఇప్పటికే ఈ మేరకు విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఓ పంచాయతీ పరిధిలో రెండు, మూడు గ్రామాలు ఉంటాయి. పంచాయతీ కేంద్రానికి ఆయా గ్రామాలకు కనీసంగా 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందువల్లే గత ప్రభుత్వాలు ప్రతి గ్రామంలోనూ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశాయి. కానీ కూటమి ప్రభుత్వం ‘మోడల్‌ ప్రైమరీ పాఠశాల’ పేరుతో గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమైంది.

బలవంతంగా తీర్మానాలు

మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు కోసం మిగిలిన పాఠశాలల్లోని స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలతో బలవంతంగా తీర్మానాలు చేయించుకునే కార్యక్రమానికి విద్యాశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇలా చేయటం వల్ల విద్యార్థులు మైళ్ల దూరం నడిచి ఇతర గ్రామాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా ఇప్పటికే జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెలలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విలీనం చేయొద్దని పాఠశాల ముందు నినాదాలు చేశారు.

విలీనం చేయొద్దు

ఉద్యమం తప్పదు

మోడల్‌ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు పేరుతో స్కూళ్ల కుదింపు

పంచాయతీల్లోని ప్రాథమిక,

ప్రాథమికోన్నత పాఠశాలల విలీనం

జిల్లాలో 1,527 ప్రాథమిక పాఠశాలల మూత?

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యార్థులు,

తల్లిదండ్రులు

41,524

ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు

15,465 మంది

ప్రాథమికోన్నత పాఠశాలల్లో

చదువుతున్న విద్యార్థులు

1,527 ప్రాథమిక పాఠశాలలు

No comments yet. Be the first to comment!
Add a comment
226 
1
1/3

226

226 
2
2/3

226

226 
3
3/3

226

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement