వైభవం.. గావుల మహోత్సవం
కనగానపల్లి: ఉరుముల శబ్దాలు, పోతురాజుల నృత్య విన్యాసాలు, భక్తుల కోలాహలం మధ్య దాదులూరు పోతలయ్యస్వామి గావుల మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. స్వామి కాపులు, భక్తులు వేకువజామునే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి బోనాలు సమర్పించారు. అనంతరం ఉరుముల శబ్దాలకు అనుగుణంగా పోతురాజులు నృత్య విన్యాసాలు చేసుకుంటూ ఆలయంలోకి వచ్చారు. ఆలయ పూజార్లు పోతలయ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోలాహలం మధ్య 11 మంది పోతురాజులు మేకపోతు పిల్లలను స్వామికి గావుల (బలి) మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయం ముందు వందలాది పొట్టేళ్లు, మేకపోతులను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
లక్షమంది రాక
పోతలయ్యస్వామి గావుల మహోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావటంతో పోతలయ్యస్వామి ఆలయ ఆవరణమంతా కిక్కిరిసిపోయింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు సుమారు లక్ష మంది వరకు భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
దాదులూరు పరుషలో
భక్తజన సందోహం
వైభవం.. గావుల మహోత్సవం
వైభవం.. గావుల మహోత్సవం
వైభవం.. గావుల మహోత్సవం
Comments
Please login to add a commentAdd a comment