వైఎస్సార్ సీపీ హయాంలోనే బీసీల అభ్యున్నతి
పెనుకొండ రూరల్: బీసీ అంటే బ్యాక్ వర్డ్ కాదని, బ్యాక్‌బోన్ అని చాటిచెప్పిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత టీడీపీ అధినేత వద్ద మార్కులు కొట్టేసేందుకు బీసీలను తామేదో ఉద్ధరించినట్లు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం... బీసీలకు ఇసీ్త్ర పెట్టెలు, కత్తెర పెట్టెలు తాయిలాలుగా ఇస్తే, బీసీల ఆత్మబంధువు వైఎస్ జగన్ మాత్రం అన్ని రంగాల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించి పాలనలో భాగస్వాములను చేశారని ఉషశ్రీ గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కేబినెట్‌లో 11 మంది బీసీలకు అవకాశమిచ్చారని, 56 బీసీ కార్పొరేషన్లతో పాటు అనేక కమిటీల్లో బీసీలకు 50 శాతం పదవులు ఇచ్చి మేలు చేశారన్నారు. అలాగే చేనేతలకు ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయం అందించి ఆదుకున్న ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. వీటన్నింటినీ విస్మరించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఏదో చేసినట్లు గొప్పలు చెప్పడం చూసి జనం నవ్వుతున్నారన్నారు. మంత్రికి నిజంగా ధైర్యం ఉంటే బీసీలకు ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందో చెప్పేందుకు బహిరంగ చర్చకు రావాలన్నారు.
బీసీలకిచ్చిన హామీలేమయ్యాయి సవిత?
మంత్రి సవితకు బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇప్పించాలన్నారు. అలాగే కురుబ గుడికట్లు పూజారులకు నెలకు రూ.5 వేల వేతనం ఇప్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. కనీసం పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి కాటన్ మిల్లు మూతపడకుండా చూసి బీసీలకు ఉపాధి కల్పించాలన్నారు. మంత్రి సవిత నిజంగా బీసీల అభివృద్ధి, మంచిని కాంక్షిస్తే ఆమె మంత్రి భర్త బీసీల్లో భాగమైన మైనార్టీలపై ఎందుకు దాడులకు తెగబడ్డారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో వైద్య కళాశాలల నిర్మాణం చేపడితే, నేడు ఆ కళాశాల నిర్మాణాలను ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. మంత్రి సవిత నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షిస్తే, వైద్య కళాశాల ప్రైవేటీకరణ ఆపాలన్నారు.
జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
Comments
Please login to add a commentAdd a comment