‘పది’ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
పుట్టపర్తి: రెగ్యులర్, ఓపెన్ పదో తరగతి పరీక్షలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని, ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ ఆదేశించారు. మంగళవారం బుక్కపట్నం డైట్ కళాశాల ఆర్డీటీ సమావేశపు భవనంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. శిక్షణ కార్యక్రమంలో డీఈఓ కృష్ణప్పతో కలిసి పాల్గొన్న ఆర్జేడీ శామ్యూల్ మాట్లాడుతూ... పదో తరగతి పరీక్ష నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడా తప్పిదాలు దొర్లకూడదన్నారు. అందరూ సమష్టిగా పనిచేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి పద్మ ప్రియ, ఏడీలు రామకృష్ణ, లాజర్, టీసీఈబీ భాస్కర్‌రెడ్డి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
‘పది’ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
Comments
Please login to add a commentAdd a comment