9న రెడ్డి ఉచిత వివాహ పరిచయ వేదిక
రాప్తాడు రూరల్: రాయలసీమ రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉచిత రెడ్డి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపకుడు రొద్దం సురేష్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు చిన్నరాసి చంద్రమౌళి రెడ్డి, సెక్రటరీ కిషోర్‌రెడ్డి తెలిపారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలోని రెడ్డి జన సంఘం కార్యాలయంలో జరిగే వేదికకు హాజరయ్యేవారు కాబోయే అబ్బాయిలు, అమ్మాయిల వివరాలు తీసుకురావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 94415 75641, 93902 84296, 94907 67224 సంప్రదించాలని కోరారు.
డీఎంఎల్‌టీలో
స్టేట్ టాపర్‌గా కావ్య
అనంతపురం మెడికల్: ఇటీవల జరిగిన డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పరీక్ష అనంతపురం వైద్యకళాశాలలోని పారామెడికల్ కోర్సు విద్యార్థిని కావ్య... రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షల్లో 480 మార్కులకు గానూ 87.77 శాతంతో 416 మార్కులు సాధించింది. విద్యార్థిని ప్రతిభను గుర్తించిన మెడికల్ కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు గురువారం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థిని మంచి మార్కులు సాధించం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ షంషాద్‌బేగం, డాక్టర్ షారోన్, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.
ఆడపిల్లకు చదువే ఆస్తి
ఓడీచెరువు: ఆడ, మగ భేదం లేకుండా పిల్లలను బాగా చదివించాలని ఆడపిల్లకు చదువే ఆస్తి అని రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి మస్తానయ్య పేర్కొన్నారు. ఓడీ చెరువులోని కేజీబీవీని గురువారం ఆయన జీసీడీఓ సంపూర్ణ, ఏపీఎంఓ మాలిక్‌తో కలసి సందర్శించి, మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా లింగ ఆధారిత వివక్ష చూపుతున్న ఐదు మండలాల్లో ఓడీచెరువు మండలం ఒకటని పేర్కొన్నారు. ఈ వివక్షతను నిర్మూలించేందుకు అన్ని శాఖల అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహాలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. అనంతరం ఆయన పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాబర్ట్ విల్సన్, ఎంఇఓలు సురేష్‌కుమార్, రమణ, ఎస్‌ఓ గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.
9న రెడ్డి ఉచిత వివాహ పరిచయ వేదిక
Comments
Please login to add a commentAdd a comment