సవాళ్లు అధిగమిస్తేనే మహిళా సాధికారత
పుట్టపర్తి టౌన్: సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని అధిగమిస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎస్పీ రత్న అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సాయి ఆరామంలో డీఎస్పీ విజయకుమార్ ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత –సవాళ్లు–పరిష్కారాలు’ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఎస్పీ రత్న ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన ఐదుగురు మహిళలను ఎస్పీ రత్న శాలువలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. అనంతరం 59 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ మహిళలు తమని తాము నిరూపించుకోవాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తారో అప్పుడే అనేక ఆటంకాలు ఎదురవుతాయన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యవసర సమాయాల్లో సహాయం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098, ఉమెన్ హెల్ప్‌లైన్ నంబర్ 181, పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 100, 112, సైబర్ క్రైమ్‌కు 1930 కాల్ చేసి సహాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయకుమార్, ఆదినారాయణ, ఆర్టీడీ రీజనల్ డైరెక్టర్ ప్రమీలా కుమారి, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానూజ, సింగర్ సరళ, సీడీపీఓ గాయత్రి, సీఐలు సునీత, ఇందిర, ఎస్‌ఐలు లింగన్న, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సవాళ్లు అధిగమిస్తేనే మహిళా సాధికారత
Comments
Please login to add a commentAdd a comment