కష్టాలను దాటి.. ఖాకీ తొడిగి
ఈమె పేరు కె. ఉదయ పావని. శిక్షణలో ఉన్న డీఎస్పీ. ప్రస్తుతం మడకశిర సర్కిల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ఉదయపావని పేద కుటుంబంలో జన్మించారు. తండ్రి నారాయణప్ప అప్పలనాయుడు వ్యవసాయం చేస్తుండగా.. తల్లి భారతి అంగన్‌వాడీ కార్యకర్త. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా ఉదయపావని కృషి, పట్టుదలతో చదువుకున్నారు. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు. తన కలల ‘ఖాకీ’ కొలువుకోసం కంటిమీద నిద్రలేకుండా చదివారు. ఎన్నో కష్టాలు ఎదురైనా వెరవక ముందుకు సాగారు. చివరకు గ్రూప్స్‌లో సత్తా చాటి డీఎస్పీగా ఎంపికయ్యారు. చదువుకు పేదరికం అడ్డుకాదని, కష్టపడి చదివితే ఫలితం ఉంటుందని చెప్పడానికి ఉదయ పావని ఉదాహారణగా నిలిచారు. – మడకశిర రూరల్:
Comments
Please login to add a commentAdd a comment