10న ఖాద్రీశుడికి పట్టు వస్తాల సమర్పణ
సాక్షి, అమరావతి: కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 10న ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రి నారా లోకేష్ సమర్పించనున్నారు. ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
ఇంటర్ పరీక్షకు 245 మంది గైర్హాజరు
పుట్టపర్తి: ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నాయి. శుక్రవారం జిల్లాలోని 42 కేంద్రాల్లో సీనియర్ ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన మ్యాథమ్యాటిక్స్–2ఏ/బాటనీ/సివిక్స్ పేపర్ –2 పరీక్షలకు 245 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 9,410 మందికి గాను 9,202 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఒకే షనల్ కోర్సులకు సంబంధించి 1,151 మందికిగానూ 1,114 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 245 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాఽశాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్ చెన్నకేశవ ప్రసాద్, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు సురేష్, రామరాజు, శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు.
ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
హిందూపురం: స్థానిక ఎంజీఎం, అజిజీయా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా సాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు 250 మంది ఈ కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని రెండు కేంద్రాల్లోనూ మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. గేట్లకు తాళాలు వేసి గదుల కిటికీలు మూసి పుస్తకాలు, చీటీలు అందజేసి పరీక్షలు రాయిస్తున్నారు.
నాణ్యతలేని గుడ్ల సరఫరాపై ఫిర్యాదు
పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యతలేని, గోలీ సైజు గోడి గుడ్లు సరఫరా చేస్తున్నారని, సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని జైభీంరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు కోరారు. శుక్రవారం ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ సుధావరలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు గోలీ సైజు కోడి గుడ్లు సరఫరా చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకుని నాణ్యమైన గుడ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
10న ఖాద్రీశుడికి పట్టు వస్తాల సమర్పణ
Comments
Please login to add a commentAdd a comment