ఆధిపత్యం.. ఉపాధి ఖతం
ముదిగుబ్బ: ఉపాధి హామీ పథకానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. తొమ్మిది నెలలుగా పనులు కల్పించకపోవడంతో కూలీలకు కడుపు కోత మిగిలింది. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో కూటమిలోని టీడీపీ–బీజేపీ–జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. పదవులు, పోస్టులు.. ఆదాయ వనరులను హస్తగతం చేసుకునేందుకు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ నాయకులు తమ స్వలాభాలు చూసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీలకం. కూటమి కొలువు దీరిన తర్వాత ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. మండలంలో 25 గ్రామపంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి ఒకటి, మేజర్ పంచాయతీల్లో ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లు అవసరం ఉంటుంది. ఆయా పోస్టుల్లో తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకునే విషయంలో టీడీపీ– బీజేపీ నాయకుల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా ఉపాధి పనులపై ఆధార పడి జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.
అదనపు పని దినాలు లేనట్లే!
గత ఏడాదిలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని ముదిగుబ్బ, తాడిమర్రి, తలుపుల, కనగానపల్లి, ధర్మవరం, ఎన్‌పీ కుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, పరిగి, రాప్తాడును కరువు మండలాలుగా ప్రకటించారు. దీంతో ఆయా మండలాల్లో 50 అదనపు పని దినాలు మంజూరు చేశారు. ముదిగుబ్బ మండలం మినహా అన్ని మండలాల్లో ఆ మేరకు పనులు జరుగుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఉపాధి పనులు కల్పించారు. ఏడాదిలో 5 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యం ఉండగా.. జూన్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరే నాటికి 2,72,406 పని దినాలు కల్పించారు.
● ఒక ఏడాదిలో కల్పించిన పనిదినాల ఆధారంగా ఆయా మండలాల అభివృద్ధికి 40 శాతం మేర మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కేటాయిస్తారు. అయితే ఇంతవరకు ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం పూర్తికానందున 2.28 లక్షల పనిదినాలను కూలీలు కోల్పోయారు. దీంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.
● ఈ విషయంపై ఎంపీడీఓ దివాకర్‌ను వివరణ కోరగా ప్రజాప్రతినిధులతో చర్చించి త్వరగా ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం చేపట్టి మార్చి 31 నాటికి వీలైనన్ని పని దినాలు కల్పిస్తామని చెప్పారు.
కూలీలు పొట్టచేతపట్టుకుని ఇతర
ప్రాంతాలకు వలస పోకుండా ఉన్న ఊరిలోనే పనులు కల్పించాలని ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారు. ఏడాదిలో వంద రోజులు పనులు కల్పించాల్సి ఉంది. కూలీల నుంచి పని దినాల సంఖ్య పెంచాలని అంతటా డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక 23 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కానీ పని దినాల సంఖ్య లక్ష్యంలో 50 శాతానికి మించలేదు. ఇది ఎక్కడో కాదు రాష్ట్ర వైద్య,
ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలోనే.
కూటమి పాలనలో పనులు కరువు
నిలిచిన ఫీల్డ్ అసిస్టెంట్ల
నియామకాలు
‘ఉపాధి’ చరిత్రలో చీకటి రోజులు
ఇదీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ఇలాకాలో దుస్థితి
ఆధిపత్యం.. ఉపాధి ఖతం
Comments
Please login to add a commentAdd a comment