5,847 కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

5,847 కేసుల పరిష్కారం

Published Sun, Mar 9 2025 12:22 AM | Last Updated on Sun, Mar 9 2025 12:21 AM

5,847

5,847 కేసుల పరిష్కారం

అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ‘జాతీయ మెగా లోక్‌ అదాలత్‌’లో 5,847 కేసులకు న్యాయమూర్తులు పరిష్కారం చూపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మొత్తం 24 బెంచ్‌లు నిర్వహించారు. బాధితులు రాజీకి సమ్మతించడంతో 886 క్రిమినల్‌ కేసులు, సివిల్‌ కేసులు 80, మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు 48, ప్రీ లిటిగేషన్‌ కేసులు 388 పరిష్కారమయ్యాయి. ప్రమాద కేసుల్లో బాధితులకు రూ. 3.83 కోట్లు పరిహారంగా అందించారు. సివిల్‌ కేసుల్లో రూ.2.82 కోట్లు, ప్రీ లిటిగేషన్‌ కేసుల్లో రూ.68 లక్షలు రాజీ ప్రకారం బాధితులకు ఇప్పించారు. లోక్‌అదాలత్‌ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. శివప్రసాద్‌ యాదవ్‌ పర్యవేక్షించారు. జిల్లా కోర్టులో కక్షిదారులకు న్యాయమూర్తి జి. శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

ఇంటర్‌ పరీక్షకు

319 మంది గైర్హాజరు

పుట్టపర్తి టౌన్‌: ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం సెట్‌–3 ప్రశ్నపత్రంతో పరీక్షలు నిర్వహించారు. జనరల్‌ విద్యార్థులు 8,198 మందికి గాను 7979 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 1,641 మందికి గాను 1,541 మంది హాజరయ్యారు. మొత్తం 319 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యా శాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. ధర్మవరంలో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలను స్పెషల్‌ ఆఫీసర్‌ చెన్నకేశవప్రసాద్‌, కమిటీ సభ్యులు సురేష్‌బాబు, రామరాజు, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరప్రసాద్‌ పర్యవేక్షించారన్నారు.

కిరికెర సర్పంచ్‌కు

ఉత్తమ పురస్కారం

హిందూపురం: పంచాయతీ స్వశక్తి అధినేత్రి ఉత్తమ పురస్కారాన్ని హిందూపురం మండలం కిరికెర పంచాయతీ సర్పంచ్‌ వైఎన్‌ భాగ్యమ్మ అందుకున్నారు. ఢిల్లీలో 5, 6 తేదీల్లో ముందస్తుగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రాష్ట్రం నుంచి ఆరుగురు మహిళా ప్రజాప్రతినిధులను ఎంపిక చేశారు. అందులో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కిరికెర సర్పంచ్‌ భాగ్యమ్మ ఉన్నారు. కార్యక్రమంలో ఆమె మహిళా సాధికారత, ఫ్రెండ్లీ ఉమెన్‌, గ్రామ పంచాయతీల అభివృద్ధి గురించి క్లుప్తంగా ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో సర్పంచ్‌ భాగ్యమ్మకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్‌ వినోద్‌కుమార్‌ చేతుల మీదుగా ‘పంచాయతీ స్వశక్తి అధినేత్రి పురస్కారం’తో జాతీయ ఉత్తమ ప్రశంసాపత్రం షీల్డ్‌ అందించి అభినందించారు. ఈ సందర్భంగా భాగ్యమ్మకు ఉమ్మడి జిల్లా మహిళా సర్పంచులు, స్థానిక పంచాయతీ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.

అలరించిన సంగీత కచేరీ

ప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. శనివారం సాయంత్రం ప్రశాంతినిలయం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి విద్యాసంస్థల ఫర్మార్మింగ్‌ ఆర్ట్స్‌ విభాగం విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. గంటపాటు నిర్వహించిన సంగీత కచేరీతో సభా మందిరం మార్మోగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
5,847 కేసుల పరిష్కారం 1
1/3

5,847 కేసుల పరిష్కారం

5,847 కేసుల పరిష్కారం 2
2/3

5,847 కేసుల పరిష్కారం

5,847 కేసుల పరిష్కారం 3
3/3

5,847 కేసుల పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement