నేడు ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందటమే ఈ అంకురార్పణ ఘట్ట ముఖ్య ఉద్దేశం. సూర్యుడు అస్తమించిన తర్వాతే అంటే రాత్రి సమయంలో ఈ అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంలో అగ్నిహోమం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే సకల దేవతలను ఆహ్వానిస్తారు.
నవధాన్యాల మొలక..
సకల దేవతల ఆహ్వానం అనంతరం భూమాతను ప్రార్థిస్తూ పాలిక (కొత్తకుండ)లను మట్టితో నింపుతారు. చంద్రున్ని ప్రార్థిస్తూ అర్చక బృందం వాటిలో నీరు పోసి నవ ధాన్యాలు చల్లుతారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం గావిస్తారు. అనంతరం అర్చక పండితులు సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అర్చక పండితులు ప్రతి రోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోసి నారు పెరిగేందుకు సహకరిస్తారు. ఈ మొత్తం తంతు వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం పట్టణ నలుమూలల ఆలయ అధికారులు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.
జిల్లా హాకీ జట్టు ప్రతిభ
ధర్మవరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ హాకీ ఆధ్వర్యంలో గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో జరిగిన 15వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా జట్టు రజత పతకం సాధించిందని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బి.సూర్యప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు గౌరిప్రసాద్, జిల్లా హాకీ కోచ్ హసేన్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను వారు శనివారం అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 6 నుంచి 8 వరకు జరిగిన 15వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలలో క్వార్టర్ ఫైనల్‌లో విజయనగరం జిల్లా జట్టుపై 3 గోల్స్, సెమీ ఫైనల్‌లో గుంటూరు జిల్లా జట్టుపై 3–1 గోల్స్ తేడాతో గెలుపొందిందన్నారు. ఫైనల్‌లో తిరుపతి జిల్లా జట్టుపై 6–2 గోల్స్‌తో ఓటమి చెందిందన్నారు.
నేడు ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Comments
Please login to add a commentAdd a comment