ప్రతి నిత్యం.. ప్రజాపక్షం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. దేశాన్ని శాసించిన జాతీయ పార్టీలు సైతం ఏపీలో గల్లంతయ్యాయి. కానీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి నిలబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. ‘‘పార్టీ అంటే ప్రజలు.. పాలకులంటే ప్రజలే’’ అంటూ సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రాంతీయ, జాతీయ పార్టీల ప్రజా వ్యతిరేక పాలనకు ఎదురొడ్డి పోరాడిన పార్టీగా వైఎస్సార్ సీపీ ముద్ర వేసుకుంది.
కష్టాలొచ్చినా ఎదురొడ్డి..
పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచింది. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల తరఫున కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ‘అనంత’ రైతుల ఆక్రందనలపై 2014–19 కాలంలో అసెంబ్లీలో గళమెత్తారు. రీయింబర్స్ మెంట్ రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల తరఫున నిలబడ్డారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతి కోసం శ్రమించారు. 2014లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం చేసిన కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన తీరును ఎండగట్టారు. చివరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు.
పాలన అంటే ఇలా ఉండాలని..
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు గెలిచింది. సాధారణంగా ఎన్నికలముందు హామీలివ్వడం, ఆ తర్వాత తుంగలో తొక్కడం చూసి ఉంటాం. కానీ పాలన చేపట్టిన రోజు నుంచే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూ.చ.తప్పకుండా జగన్ అమలు చేశారు. జిల్లాలో లక్షలాది మంది రైతులకు చెప్పిన తేదీకే ‘రైతు భరోసా’ అందించారు. డ్వాక్రా మహిళలకు ఆసరా, ‘సున్నా వడ్డీ’తో అండగా నిలిచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఆదుకున్నారు. ప్రాథమిక ఆరోగ్యానికి పునరుజ్జీవం పోశారు. పాలన వికేంద్రీకరణ జరిగితేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని గ్రామ వార్డు సచివాలయాలు తెచ్చారు. ఈ క్రమంలో జిల్లాలో వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే పెనుకొండకు మెడికల్ కాలేజీ, అనంతపురంలో ఎంసీహెచ్ బ్లాకు, హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు, పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు ఇలా ఒకటేమిటి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత జగన్‌దే. అయితే, ప్రజలను మభ్యపెట్టి 9 నెలల క్రితం గద్దెనెక్కిన చంద్రబాబు.. వచ్చీ రాగానే విద్యార్థులు, రైతులు, డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నేడు ‘యువత పోరు’కు శ్రీకారం చుడుతున్నారు.
ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచిన ‘వైఎస్సార్ సీపీ’
ఉమ్మడి అనంత జిల్లాలో రైతులు, మహిళల పక్షాన ఎనలేని పోరాటాలు
2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి..
సీఎంగా పాలన అంటే ఇలా
ఉండాలని చూపించిన జగన్
నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ప్రతి నిత్యం.. ప్రజాపక్షం
Comments
Please login to add a commentAdd a comment