డెంగీ లక్షణాలతో వ్యక్తి మృతి
చెన్నేకొత్తపల్లి: మండలంలోని న్యామద్దెల గ్రామానికి చెందిన సురేంద్ర (34) డెంగీ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. గత 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సురేంద్ర చెన్నేకొత్తపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే జ్వరం తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమిస్తుండడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక మంగళవారం రాత్రి ఆయన మృతి చెందాడు. కాగా, డెంగీ లక్షణాలతో మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
బాలలపై లైంగిక వేధింపులు నివారించాలి
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజబేగం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో బాలలపై లైంగిక వేధింపులను పూర్తిగా నివారించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం, రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ నివేదిత అన్నారు. బాలల లైంగిక వేధింపుల నివారణ అంశంపై బుధవారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో వారు మాట్లాడారు. లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ అత్యవసర సహాయ టోల్ ఫ్రీ నెంబర్లను గుర్తుంచుకోవాలన్నారు. వేధింపులు జరిగినప్పుడు వెంటనే 1098, 181, 100కి కాల్ చేసి సాయం పొందేలా చిన్నారుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే చెప్పుకునే సేచ్ఛను ఇవ్వాలన్నారు. అనంతరం డీఈఐసీ చైల్డ్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ సిరిగిరి సుందరరావు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, విద్యాశాఖ, జువైనల్ శాఖ, ఒకేషనల్ విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
టీడీపీ నేతల దాష్టీకం
● వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కర్రలతో దాడి
ఆత్మకూరు: వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైన కురుబ చిక్కాల బాలన్నపై టీడీపీ నేతలు అతి కిరాతకంగా కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన బుధవారం రాత్రి ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన మేరకు... బుధవారం సాయంత్రం తన పొలంలో పనులు చూసుకుని ఇంటికి వెళుతున్న బాలన్నపై కాపు కాచిన టీడీపీ నేతలు కర్రలతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కురుబలపై దాడి చేయడం ద్వారా వారిలో అభద్రతా భావాన్ని పెంచేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఈ కుట్రకు తెరలేపినట్లుగా పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దాడి అనంతరం కురుబ చిక్కాల బాలన్న ఆత్మకూరుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన నారాయణస్వామి, రమేష్, భరత్‌పై చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఏపీఆర్‌ఎస్
ప్రవేశ పోస్టర్ల విడుదల
పరిగి: ఆంధ్రప్రదేశ్ గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలతో పాటు మిగిలిన తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ పోస్టర్లను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి క్రిష్టప్ప విడుదల చేశారు.బుధవారం ఆయన పరిగి మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్ జేసీ కాలేజ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిష్టప్ప మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో 5వ తరగతిలో చేరే విద్యార్థులకు ఈనెల 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నారు. అదేవిదంగా 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను నోటిపికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.
డెంగీ లక్షణాలతో వ్యక్తి మృతి
డెంగీ లక్షణాలతో వ్యక్తి మృతి
డెంగీ లక్షణాలతో వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment