
రోడ్డు ప్రమాదంలో చిన్నారులకు తీవ్రగాయాలు
మడకశిర: పట్టణ సమీపాన వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాల పాలయ్యారు. రొళ్ల మండలం కొడగార్లగుట్ట గ్రామానికి చెందిన సన్నలింగప్ప తన కుమార్తె ప్రార్థన, కుమారుడు గోకుల్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బైక్‌పై మడకశిరకు బయలుదేరాడు. ఈ క్రమంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల సమీపాన జాతీయ రహదారి పక్కన చెరుకు రసం తాగడానికి బైక్‌ను రోడ్డు పక్కన ఆపి ఇద్దరినీ అందులోనే కూర్చోబెట్టి చెరుకు రసం తేవడానికి వెళ్లాడు. ఈ సందర్భంలో మధుగిరి నుంచి పావగడ వైపు వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. ఘటనలో ప్రార్థన కుడి కాలు పూర్తిగా దెబ్బతింది. గోకుల్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని 108లో మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం హిందూపురం తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో మహిళ మృతి
గోరంట్ల: మండలంలోని కరావులపల్లి తండాలో విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన తిప్పిబాయి (49) గురువారం ఉదయం ఇంటి వద్ద తాగునీటి సంపునకు అమర్చిన విద్యుత్ మోటార్‌ను ఆన్ చేసేందుకు యత్నించింది. విద్యుత్ షార్ట్‌సర్కూట్‌తో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త శ్రీరాములు ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో చిన్నారులకు తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో చిన్నారులకు తీవ్రగాయాలు
Comments
Please login to add a commentAdd a comment