పుట్టపర్తి రూరల్: ‘చేదు మిగిల్చిన తీపి పంట’ శీర్షికన ఈ నెల 27న ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ఉద్యాన అధికారులు స్పందించారు. జిల్లా ఉద్యాన శాఖాధికారి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు మండల హెచ్‌ఓ నవీన్‌కుమార్ బృందం గురువారం ఎనుములపల్లి పర్యటించి, రైతులు సాగు చేసిన కర్బూజ పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలు, ఎంత మేర నష్టం వాటిల్లింది తదితర వివరాలు సేకరించారు. 10 నుండి 15 శాతం వరకు కాయల్లో చీలికలు ఏర్పడిందని, 30 శాతం వరకు పంట నష్టం జరిగినట్లుగా గుర్తించినట్లు నవీన్‌కుమార్ తెలిపారు. నూట్రీన్స్ బోరాన్, క్యాల్షియం తగిన మోతాదులో సరైన నీటి తడులు అందిస్తే చీలికలు ఏర్పడకుండా ఉంటాయని వివరించారు. మార్కెటింగ్ సతదుపాయం రైతుల అభ్యర్థనను ఉన్నతాధికారులకు నివేదిస్తామని భరోసానిచ్చారు.
కర్బూజ పంటల పరిశీలన