ఖాద్రీశుడి దర్శనం.. భక్త పారవశ్యం
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గురువారం ఖాద్రీశుడు హనుమద్వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఉత్సవాలకు ఉభయదారులుగా జొన్నా వీరయ్య, జొన్నా వీర శేషయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖాద్రీ లక్ష్మీనారసింహుడు శుక్రవారం (నేడు) గరుడ వాహనంపై తిరువీధుల్లో తన భక్తులకు దర్శనమివ్వనున్నారు. నృసింహస్వామిని ఇలవేల్పుగా కొలిచే భక్తులంతా బ్రహ్మగరుడు సేవ రోజునే ‘కదిరి పున్నమి’ పేరుతో పండుగ జరుపుకుంటారు.
హనుమద్వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
భక్తులతో కిటకిట లాడిన ఆలయం
ఖాద్రీశుడి దర్శనం.. భక్త పారవశ్యం
ఖాద్రీశుడి దర్శనం.. భక్త పారవశ్యం
ఖాద్రీశుడి దర్శనం.. భక్త పారవశ్యం
Comments
Please login to add a commentAdd a comment